Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 13 రిపోర్టర్ సలికినీడి నాగరాజు 5 ఏళ్లలో జగన్ ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారం రూ.1,29,000కోట్లు : ప్రత్తిపాటి. ఎక్కువ ధరకు ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొని, తనకు వచ్చిన కమీషన్ల సొమ్మును తాడేపల్లిలో లెక్కపెట్టుకుంటున్నాడు : ప్రత్తిపాటి. ఎదుటివారి కన్ను పొడిచి ఆనందించాలనుకున్న జగన్ రెండుకళ్లను గత ఎన్నికల్లో ప్రజలు పొడిచారు : ప్రత్తిపాటి. రాష్ట్ర టెక్స్ టైల్ రంగాన్ని ఆదుకోవడంపై ప్రభుత్వం వెంటనే కేంద్రంతో సంప్రదింపులు జరపాలి: పుల్లారావు ఉమ్మడి గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్ల చోరీ సమస్య ఎక్కువైంది : పుల్లారావు దొంగతనాలకు పాల్పడేవారిపై ప్రభుత్వం పీడీ యాక్ట్ లు నమోదుచేయాలి. రైతుల మోటార్లు కొనే వారిపై కూడా కఠినచర్యలు తీసుకోవాలి : పుల్లారావు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని అవగాహన విద్యుత్ రంగంపై చంద్రబాబుకు ఉందని, ఆ అనుభవంతోనే రాష్ట్ర విభజన తర్వాత 22 మిలియన్ యూనిట్ల లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను 2019లో ఆయన దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం శాసనసభలో విద్యుత్ రంగం స్థితిగతులపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర టెక్స్ టైల్ రంగం సమస్యలతో పాటు, ఉమ్మడి గుంటూరుజిల్లాలో మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్ల చోరీ సమన్యను కూడా మాజీమంత్రి సభద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు హయాంలో మిగులు విద్యుత్ రాష్ట్రం.. జగన్ పాలనలో కోతలు, ప్రజలపై భారీ వాతలకు కేంద్రంగా మారింది… “ చంద్రబాబు మిగులు విద్యుత్ గా మార్చిన రాష్ట్రాన్ని జగన్ తన హాయాంలో విద్యుత్ కోతలకు కేంద్రంగా మార్చాడు. చంద్రబాబు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తే, జగన్ తన అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని దారుణంగా దెబ్బతీశా డు. పీపీఏల రద్దు నిర్ణయంతో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని కోలుకోలేనివిధంగా దెబ్బతీసిన జగన్, సోలార్ పవర్ ప్లాంట్లపై దాడులకు పాల్పడి, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల మూసివేతే లక్ష్యంగా వ్యవహరించాడు. తనకు గిట్టని వ్యక్తులు, సంస్థలే లక్ష్యంగా రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థల్ని, వాటి యాజమాన్యాన్ని జగన్ ఇబ్బందులకు గురిచేసి, బిల్లులు కూడా చెల్లించకుండా వేధించి అంతిమంగా రాష్ట్రానికి చీకట్లు మిగిల్చాడు. ఎదుటివాడు ఒక కన్ను పొడిచి ఆనందించిన జగన్ రెండుకళ్లను ప్రజలు గత ఎన్నికల్లో పొడవడం జరిగింది. జగన్ చర్యలతో తానేమీ నష్టపోలేదు. విద్యుత్ ను అధికధరకు కొన్నమందబుద్ధి చర్యల ప్రభావాన్ని నేటికీ రాష్ట్రప్రజలు అనుభవిస్తున్నారు. తాను పెంచిన ఛార్జీల భారం ప్రజలపై మోపిన జగన్, వారినుంచి ముక్కుపిండి మరీ విద్యుత్ ఛార్జీలు వసూలు చేశాడు. జగన్ ఐదేళ్లలో ప్రజలపై రూ.1,29,000కోట్ల భారం మోపాడు ట్రూ అప్ ఛార్జీలు, నెలవారీ సర్దుబాట్లు, యూనిట్ ఛార్జీల..ఇతరత్రా పేర్లతో ఐదేళ్లలో రూ.1,29,000 కోట్ల భారం మోపాడు. జగన్ అత్యాశతో పాటు, అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఈ భారం భరించలేక విసిగిపోయారు. ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధరకు విద్యుత్ కొని, తనకు రావాల్సిన కమీషన్లు దండుకొని జగన్ ఆ సొమ్మును లెక్కపెట్టుకుంటూ తాడేపల్లిలో కూర్చు న్నాడనేది వాస్తవం. 2014-19 మధ్య చంద్రబాబు ప్రజలపై పైసా విద్యుత్ ఛార్జీలు వేయలేదు.. చంద్రబాబు హాయాంలో 2014-19 మధ్య ప్రజలపై పైసా విద్యుత్ ఛార్జీల భారం వేయలేదు. ఆనాడు ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై మాట్లాడటానికి సాహసం చేయలేదు. కానీ జగన్ తన హాయాంలో ప్రజలపై లక్షా29వేలకు పైగా వేసిన భారం వల్ల నేటికీ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ కోలు కోవడానికి చాలా సమయం పడుతుంది. కూటమిప్రభుత్వం క్రమక్రమంగా రాష్ట్ర విద్యుత్ రంగాన్ని సంస్కరిస్తూ, ప్రజలపై భారం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తోంది. రాష్ట్ర టెక్స్ టైల్ రంగం దుస్థితిని కేంద్రానికి తెలియచేసి, పరిశ్రమలను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలి.. రాష్ట్ర టెక్స్ టైల్ రంగం సమస్యలపై నిన్న కూడా సభలో మాట్లాడాను. ప్రత్యేకంగా రాయితీలు, విద్యుత్ సబ్సిడీలు ఇస్తే తప్ప రాష్ట్ర టెక్స్ టైల్ రంగం బతకదని ప్రభుత్వానికి తెలియచేస్తున్నా. కేంద్రప్రభుత్వం కూడా సహాయసహకారాలు అందిస్తేనే ఏపీలో టెక్స్ టైల్ రంగం పుంజుకుంటుం ది. తమిళనాడు టెక్స్ టైల్ రంగాన్ని అక్కడి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల, అక్కడ 40 శాతం పరిశ్రమలు మూతపడ్డాయి. బ్యాంకుల ఎన్.పీ.ఏల వల్ల రికవరీ లేక పరిశ్రమలు మూత పడితే, అంతిమంగా నష్టపోయేది ఆ పరిశ్రమలపై ఆధారపడి బతికేవారే. రాష్ట్ర టెక్స్ టైల్ రంగం బతికి బట్టకట్టాలంటే సమస్యను ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రిగారి దృష్టికి తీసుకెళ్లాలని సభాముఖంగా విజ్ఞప్తిచేస్తున్నాను. పదేపదే సమస్య గురించి చెప్పడానికి కారణం వేలాది మంది ఈ పరిశ్రమల్ని నమ్ముకొని బతుకుతుండటమే. టెక్స్ టైల్ రంగాన్ని నమ్ముకొని, ముఖ్యంగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పని చేయడానికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వేలసంఖ్యల వచ్చి పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో టెక్స్ టైల్ రంగం బలోపేతానికి, నిలబెట్టడానికి అక్కడి ప్రభుత్వాలు చేపట్టిన చర్యలపై కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాను. మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్ల దొంగలపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలి. లిఫ్ట్ స్కీముల మోటార్ల చోరీతో రైతులు, ప్రజలు నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువశాతం లిఫ్ట్ ఇరిగేషన్లు చిలకలూరిపేట నియోజకవర్గంలోనే ఉన్నాయి. దాదాపు 55కు పైగా ప్రధాన లిఫ్ట్ ఇరిగేషన్ల సాయంతోనే మా ప్రాంతంలో వ్యవసా యం జరుగుతోంది. వాటిలోని మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు చోరీకి గురవుతుండటం మా ప్రాంతా నికి ప్రధాన సమస్యగా తయారైంది. దొంగిలించిన మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కొనేవారిపై నిఘా పెట్టి, వారిపై పీడీయాక్ట్ పెట్టి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాను. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎన్నో గ్రామాలకు మంచినీరు సరఫరా అవుతుంది. దొంగలభయంతో గ్రామాలకు తాగునీరు కూడా అందని పరిస్థితి. చిలకలూరిపేట నియోజకవర్గంలోని పసుమర్రులో తాగునీటి సమస్య పరిష్కారంకోసం రూ.4లక్షలు చెల్లించి, అద్దెకు మోటార్లు తీసుకురావడం జరిగింది. సమన్యను కళ్లారా చూశాను కాబట్టి, రైతుల.. ప్రజల తాగు, సాగునీటి అవస్తలు తెలిసిన వ్యక్తిగా సమస్య ను సభ దృష్టికి తీసుకొచ్చాను.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి స్పష్టం చేశారు.