Listen to this article

జనం న్యూస్, మార్చి 14, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలానికి చెందిన గోపాల మిత్ర మార్గడి వెంకట్ రెడ్డి ఇటీవల మృతి చెందగా ఉమ్మడి మెదక్ జిల్లా గోపాలమిత్ర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గురువారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గోపాల మిత్ర అధ్యక్షులు సింగం రాజు యాదవ్, రాష్ట్ర సలహాదారు శ్రీరాములు, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, కోశాధికారి గౌరీ శంకర్ ,మెదక్ జిల్లా అధ్యక్షులు అశోక్, మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు రామస్వామి, సూపర్వైజర్ అబ్దుల్ సత్తార్, గోపాల మిత్రులు గౌరీ శంకర్, చంద్రశేఖర్, ఆంజనేయులు, శ్రీనివాస్, కృష్ణ, దేవరాజ్, తిరుపతి రెడ్డి,నర్సింలు, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు