

జనం న్యూస్ మార్చి 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూగర్భ జలవనరులను పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్వినందులాల్ పవర్ తెలిపారు.గురువారం సూర్యాపేట కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో భూగర్భ జల కేంద్ర బోర్డు నీరు పారుదల వనరులు నదుల అభివృద్ధి గంగాపూర్ జీవన విభాగం జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భూగర్భ జల అభివృద్ధి, నిర్వహణ విధానాలపై టియర్-॥౹ శిక్షణా టీఎలకు, టీసీలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు.భూగర్భ జల కేంద్ర బోర్డు, ప్రాంతీయ సంచాలకులు జి కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలవనరులను పెంచడానికి వాన నీటిని సంరక్షించడానికి ఇంకుడుగుంటలు, చెక్ డ్యాములు, రీఛార్జి స్ట్రక్చర్స్ కట్టాలని, నరేగా కింద వాటర్ రీఛార్జ్ స్ట్రక్చర్లు, సోపీట్లు, ఇంకుడు గుంటలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో కృష్ణ,మూసీ నదుల ప్రవాహాలు ఉన్నప్పటికీ అలాగే ఎన్ ఎస్ పి, ఎస్ ఆర్ ఎస్ పి ల ద్వారా సాగునీరు, త్రాగునీరు లభ్యత ఉన్న గాని గ్రౌండ్ వాటర్ చాలా మండలాలలో తగ్గిపోతుందని కలెక్టర్ ఆన్నారు. కృత్రిమ వనరుల ద్వారా వచ్చిన నీటిని వోడిసిపట్టి భూగర్భ జలాలు పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలలో భూపోలలో మార్పులు,బండల వల్ల నీరు భూమిలో ఇంకడండం లేదని, అలాంటి చోట ప్రత్యేక చొరవ చూపి రీచార్జి స్ట్రక్చర్స్ కట్టాలని, వీలైన చోట్ల చెక్ డ్యాములు నిర్మించాలని కలెక్టర్ తెలిపారు.టీసీలు ,టి ఏ లు ప్రత్యేక శ్రద్ధ చూపి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహనపరిచి, వాన నీటిని,అలాగే వృధాగా పోతున్న నీటిని వోడిసిపట్టడానికి ఇంకుడు గుంటలు, బోర్ల దగ్గర రీఛార్జ్ స్ట్రక్చర్లు, కట్టుకోనే విధంగా అవగాహనపరిచి చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూగర్భ జల సంరక్షణ నిర్వహణ యొక్క ప్రాముఖ్యత ను తెలియజేస్తూ సూర్యాపేట జిల్లాలో సిజిడబ్ల్యూబి ద్వారా పూర్తి చేయబడిన మ్యాపింగ్ పనులను కలెక్టర్ ప్రసంశించారు.ఫీల్డ్ అధికారులంతా సమగ్ర నీటి నిర్వహణ కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనాలని కలెక్టర్ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ వాల్టా చట్టాన్ని అందరూ అమలు పరచాలని అధికారులకు సూచించారు. మానవాళికి నీరు, గాలి చాలా ముఖ్యమని న్యూ లేఔట్స్లలో వాటర్ ను అమలుపరచాలని 10 శాతం గ్రీనరీ, సోఫిట్స్ లేకుండా అనుమతులు ఇవ్వవద్దని అదనపు కలెక్టర్ తెలిపారు. నూతనంగా కట్టే ఇళ్లకు సోఫిట్స్ లేకుండా కూడా అనుమతులు ఇవ్వవద్దని అదనపు కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. భావితరాలకు మంచి నీరు, గాలి అందాలన్న ఇప్పటినుండి వాన నీటిని ఒడిసిపట్టే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. అనంతరం సీనియర్ సైంటిస్టులు డాక్టర్ ఎస్ ఎస్ విటల్, టి రాజబాబు సూర్యాపేట జిల్లా ఆక్విఫర్ మ్యాపింగ్ మరియు నిర్వహణ ప్రణాళికలు, కృత్రిమ రీఛార్జ్ సాంకేతికలు, నీటి సంరక్షణ అనే అంశాలపై సాంకేతిక ప్రదర్శనలు ద్వారా వివరించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ వివి అప్పారావు, జిల్లా భూగర్భ జల అధికారి బాలు ,భూగర్భ జలబోర్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.