

జనం న్యూస్ :14 మార్చ్ శుక్రవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ : సిద్దిపేట జిల్లా కేంద్రంలో రంగులు చల్లుకొని కవులు హోలీ పండుగ జరుపుకున్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపి, చెడుపై మంచి విజయంగా జరుపుకునే పండుగ హోలీ. సప్త వర్ణాల రంగులు ఎన్నెన్నో రంగులను సృష్టించినట్లుగా జీవితంలో ఎన్నో విజయాలకు దారులు ఉన్నాయంటూ హోలీ పండుగ జరుపుకుంటారని సిద్దిపేట కవులు అన్నారు. కవులు ఉండ్రాళ్ళ రాజేశం, వర్కోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, కోణం పర్శరామలు, యాడవరం చంద్రకాంత్, రాచకొండ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.