Listen to this article

నందికొండ మున్సిపాలిటీలో ఘనంగా హోలీ సంబరాలు

జనం న్యూస్- మార్చి 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి కుల మతాలకతీతంగా యువకులు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు, హిల్ కాలనీలోని ఫ్రెండ్స్ యూత్ సభ్యులు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు, పైలాన్ కాలనీలో ఈర్ల రామకృష్ణ (ఆర్కే) ఆధ్వర్యంలో 9వ వార్డులో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు, ఇంద్రధనస్సులోని ఏడు రంగులు లాగా మన జీవితం కూడా సుఖసంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో రంగుల మయంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా మాజీ కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ( ఆర్కే) తెలిపారు,ఈ కార్యక్రమంలో తొమ్మిదవ వార్డు మాజీ కౌన్సిలర్ ఇర్ల రామకృష్ణ( ఆర్కె), కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మద్దాల భాను, కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు బాలాజీ నాయక్, మైనార్టీ నాయకులు షేక్ కాసిం, షేక్ నాగూర్, శివ, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.