Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ, అరవపల్లి క్రీడా మైదానము నందు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాద చారులకు మరియు క్రీడాకారులకు మైదానము నందు అడ్డంకిగా ఉన్నటు వంటి పిచ్చి మొక్కలు మరియు ముళ్లపొదలను నందలూరు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మోడపోతుల రాము సౌజన్యంతో ఉపాధి హామీ కార్మికుల ద్వారా శుభ్రపరచడం జరిగింది.ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ డైరెక్టర్స్ మన్నెం రామమోహన్, కుర్రా మణి యాదవ్, వాకర్స్ క్లబ్ సెక్రటరీ ఉప్పుశెట్టి సుధీర్, వాకర్స్ గురు ప్రసాద్, గంధం గంగాధర్, సోమిశెట్టి ప్రభాకర్, మంటి మారయ్య, జంగం శెట్టి హరి, కృష్ణ, సునీల్ రెడ్డి, నరసింహ శెట్టి, సుబ్బారెడ్డి, ఆండ్రూస్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.