

జనం న్యూస్ // మార్చ్ // 14 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఇందిరానగర్ కాలనీలో హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత ఆధ్వర్యంలో , హోలీ వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారందరూ జీవితాల్లో కూడా ఆనందంతో సంతోషాలతో నిండుగా ఉండాలని మహిళా సోదరీమణులందరి జీవితాలు రంగుల మయంలో ఉండాలని పిల్లలు, పెద్దలు అందరూ హోలీ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముక్క రజిత, రమ, కవిత, దుబాసి రాణి, చందమల్ల పుణ్య, రేణుక,కళ, పల్లవి, జయసుధ, అంజలి తదితర మహిళలు పాల్గొన్నారు.