

భారీగా తరలివచ్చిన భక్తజనం
మార్చి 14 జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో వేంచేసిఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పద్మావతి అలివేలుమంగ శ్రీ వేంకటేశ్వరస్వామి తిరుకళ్యాణం మహోత్సవం అంగరంగా వైభవంగా వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తుల స్వామివారి నామస్మరణ ల మధ్య నేత్ర పర్వంగ జరిగింది దేవాదయశాఖ ఆలయకమిటి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్ధం చలువపందిల్లు వేసి విశ్రుతమైన ఏర్పాట్లు చేశారు వేలాదిమంది భక్తులు స్వామివారి కల్యాణమహోత్సవాన్ని తిలికించేందుకు ఆలయానికి రాగ భక్తులతో ఆలయప్రాంగణం కిటకిటలాడింది కళ్యానానికి వచ్చిన భక్తులకు బి ఆర్ ఎస్ పార్టీ భద్రాచలం ఇంచార్జి రేగ కాంతారావు, వెంకటాపురం మండల అధ్యక్షులు గంప రాంబాబు, సీనియర్ నాయకులు గొడపర్తి నర్సింహామూర్తి, మండలకమిటీ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్ పంపిణి, అన్నదాన కార్యక్రమన్ని చేపట్టారు మరియు శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో మంచి నీళ్లు స్వకర్యం కల్పించారు ఆలయప్రాంగణంలోవందల దుకాణాలు రకరకాల వస్తువులతో బొమ్మలతో కొనుగోలు దారులను ఆక్రశిస్తున్నాయి
