Listen to this article

జనం న్యూస్ 15మార్చ్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం ,రావికంపాడు గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గానుగపాడు సహకార సంఘం ఉపాధ్యక్షురాలు భూపతి ధనలక్ష్మి కేక్ ను కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూపతి ధనలక్ష్మి గారు మాట్లాడుతూ….. కార్యకర్తలకు అండగా ఉండే మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పార్టీకి కార్యకర్తలకు అండగా ఉండే నామాలాంటి నాయకుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదర్శప్రాయుడన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు , జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ మండల నాయకులు మందా అనిల్, గౌడ సంఘం మండల నాయకులు కెక్కెర్ల వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ నాయకులు ధరావతులాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.