

జనం న్యూస్ జనవరి 13
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కానర్ గాం గ్రామ పరిధిలో పేకాట స్థావరం పై వాంకిడి ఎస్సై పోలీస్ సిబ్బంది తో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. వాంకిడి ఎస్ఐ ప్రశాంత్ కు వచ్చిన పక్కా సమాచారం మేరకు తన సిబ్బందితో కలసి దాడి చేసి 8 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 4, 200 నగదును స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారన్నారు