Listen to this article

ఆర్టీవో కార్యాలయంలో చలాను ల ధరల పట్టిక ఏర్పాటు చేయాలి ప్రజాసంఘాల , ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మల్లెపూల మధుకర్ కి వినతి జనం న్యూస్ మార్చ్ 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్ కొరకు, మరియు లైసెన్సుల కొరకు ఆన్లైన్ లో అప్లై చేసుకొని ఆర్టిఓ కార్యాలయం వెళ్తే బ్రోకర్ ద్వారా రావాలని వారి ద్వారా మీకు రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ ఇస్తామని అంటూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వేరే అవకాశం లేక బ్రోకర్ వ్యవస్థ తోటే లైసెన్స్ రిజిస్ట్రేషన్లు చేసుకున్న పరిస్థితి వస్తుంది, వారు వాహనదారుల దగ్గర సుమారుగా వేళల్లో రూపాయలు వసూలు చేస్తున్నారు, అమాయకులని ఆశలు చేసి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు, అదేవిధంగా ఆర్టీవో కార్యాలయంలో వాహనాలతో ట్రయల్ చేద్దామంటే ఒక్కొక్క వాహనానికి సుమారుగా 500 వందల రూపాయలు తీసుకుంటున్నారు, సొంత వెహికల్ ఉందని చెప్పిన బ్రోకర్ల వెహికిల్ తోటే ట్రయల్ కొట్టాల్సిన పరిస్థితి ఉంది, అంతేకాకుండా ఆర్డీవో కార్యాలయంలో ఏ వాహనానికి ఎంత చలాన్ కట్టాలో ధరల పట్టిక కూడా పెట్టడం లేదు, అక్కడ పనిచేస్తున్న జిల్లా అధికారులు వాహనదారుల వద్ద నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు, అధికారుల మాటలు వాహనదారులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి కావున జిల్లా ఆర్డీవో మరియు కార్యాలయం సిబ్బంది, బ్రోకర్ వ్యవస్థపై చర్యలు తీసుకోవాలి తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం టీఏజీఎస్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య టీఏజీఎస్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ గా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మల్లెపూల మధుకర్ కి వినతి అందజేశారు, ఈ కార్యక్రమంలో టీఏజీఎస్ జిల్లా అధ్యక్షురాలు కొరెంగ మాలశ్రీ,డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ పాల్గొన్నారు,