

జనం న్యూస్ మార్చి 15(నడిగూడెం) జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి అన్నారు. శనివారం నడిగూడెంలో MNREGS నిధులు రూ.70 వేలతో నిర్మిస్తున్న పశువుల కొట్టములను పంచాయతీ కార్యదర్శి పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. వారితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ ఉన్నారు.