Listen to this article

జనం న్యూస్ మార్చి 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం కొక్కిరేణి, తిమ్మారెడ్డి గూడెం గ్రామాలలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచాలని గ్రామాలలో రేషన్ కార్డులు, ఇండ్లు వికలాంగుల, వితంతు వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని గ్రామాలలో డ్రైనేజీ సమస్యలు, రైతుబంధు రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు శాఖ కార్యదర్శి నందిగామ సైదులు మండల కమిటీ సభ్యులు రేఖ లింగయ్య, మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ములకలపల్లి ఝాన్సీ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వట్టెపు చిన్న సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు ములకలపల్లి సైదులు, గ్రామ మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ రావులపెంట వెంకన్న, బ్రహ్మం, సింగిల్ విండో డైరెక్టర్ నిడిగొండ శంబయ్య, డివైఎఫ్ఐ గ్రామ నాయకులు, మామిడి గురుమూర్తి, ఇంటూరి హుస్సేన్, మంద శ్రీరాములు పేరు బోయిన నాగలింగం, నూక లింగయ్య , రాంపంగు సైదమ్మ ,మేరీగ లక్ష్మి నాయకులు తదితరులు పాల్గొన్నారు..