Listen to this article

జనం న్యూస్ 16 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణంలోని ఇళ్లు లేని పేదలకు 2 సెంట్లు భూమి ఇచ్చి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చెయ్యాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా శనివారం 22వ డివిజన్‌ జొన్నగుడ్డిలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. జొన్న గుడ్డి పేదలు దశాబ్దాలుగా అక్కడే నివాసం ఉంటున్నా పట్టాలకు నోచుకోలేదని అన్నారు. ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని కోరారు.