Listen to this article

జనం న్యూస్ మార్చి 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ తులసి వనం వద్ద అవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐదు కిలోమీటర్ల పరుగు కార్యక్రమాన్ని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు వారి ఆర్థిక అభివృద్ధిలో మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుంటుంది అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీల్లో నాలుగు హామీలు మహిళలను ఉద్దేశించినవే అన్నారు ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్ పూజిత గౌడ్ నాయకులకు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు శివా చౌదరి రమణ సలీం ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.