

జనం న్యూస్, మార్చ్ 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) దళితుల జోలికి వస్తే ఎంతటి పెద్దవారినైనా సహించేది లేదని ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పడిగెల అమర్ అన్నారు.నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దానికి నిరసనగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాజి అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక కొమరం భీమ్ చౌరస్తాలో ఆదివారం కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి బొమ్మలను దగ్నం చేశారు.
ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ టిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని అన్నారు కేటీఆర్ కు దళితులపై ఎంత ప్రేమ ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు గతంలో కెసిఆర్ ప్రభుత్వం దళితులకు విలువ ఇవ్వలేదని విమర్శించారు ఇప్పుడు స్పీకర్ను ఆ పార్టీ అవమానించిందన్నారు పదేండ్ల ప్రభుత్వంలో ఉన్న మీరు స్పీకర్ కు ఇస్తున్న విలువ ఏంటో తెలుసుకోవాలి దళిత స్పీకర్ను అవమానించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేస్తాననడం సిగ్గుచేటని కేటీఆర్ కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. ఏకంగా అసెంబ్లీ సభాపతిని దళితుల్ని నియమించి దళితుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని పేర్కొన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దళితుల పెత్తనం ఓర్వలేక కించపరిచే కార్యక్రమాన్ని చేపడుతున్నారని మండిపడ్డారు ఖబర్దార్ కేటీఆర్, కెసిఆర్, జగదీశ్వర్ రెడ్డిలు అంటూ సవాల్ విసిరారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అంటూ మాట తప్పడమే కాకుండా దళితుల పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. కెసిఆర్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి హాజరు కాకుండా లక్షల రూపాయల జీతం తీసుకున్న అసమర్ధ నాయకుడని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిత్తరి సాగర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పడగల అమర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు మేడిశెట్టి శంకర్, యూత్ మండల్ అధ్యక్షులు పొన్నం హరీష్ కుమార్, యూత్ ఉపాధ్యక్షులు పులి శెట్టి రాజశేఖర్, పెరుమండ్ల వెంకటేశం గౌడ్, బొల్లం శంకర్, బుద్దె విజయ్, చిన్నయ్య, బాలయ్య, శేఖర్, చుంచు బాపురావు, సైదం లచ్చన్న, పులి కొమురయ్య, వాల్క రామచందర్, బొడ్డు అశోక్, శ్రీనివాస్ వెంకన్న ఎదుల భీమయ్య, ఎలగతి వెంకటేష్, గోవిందుల ఆశాలు గంధం ఎల్లయ్య, కొరివి రాహుల్, రంజిత్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు
