


ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్.. జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ పేర్కొన్నారు. మంత్రివర్యులు పున్నం ప్రభాకర్, సహకారంతో హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు, నేతృత్వంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా వారు తెలిపారు. అందులో భాగంగా ఇల్లందకుంట మండల వ్యాప్తంగా 15 గ్రామాలకు సిసి రోడ్లు డ్రైనేజీ లకు సంబంధించిన పనులకు నిధులు కేటాయించినట్టుగా పెద్ది కుమార్ తెలిపారు. అందులో భాగంగా సీతంపేట గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభించినటువంటి కార్యక్రమంలో గ్రామస్తులతోపాటు పాల్గొని సంబరాలు జరుపుకోవడం జరిగిందని పెద్ది కుమార్ తెలిపారు.ప్రభుత్వం ఏర్పడ్డ 15 నెలల్లోనే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రామాల్లో ప్రజలకు అందడం ఎంతో ఆనందదాయకమని తెలుపుతున్నాం అని అన్నారు. గత ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల అప్పులను చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన నేడు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాకచక్యంతో ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయేందుకు విశేష కృషి చేస్తుంది కాబట్టి ప్రజానీకమంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనునిత్యం అండగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో .. ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తో పాటు నాయకులు అన్నం ప్రవీణ్, వీరారెడ్డి, తెడ్ల బీరయ్య, పిట్టల సతీష్, తెడ్ల సమ్మయ్య, మైస ఎల్లయ్య, బోయిన విష్ణు, కట్ల కుమారస్వామి, తెడ్లగట్టయ్య, చెట్ల పెద్దగట్టయ్య, బండారి అనిల్, బండారి శివకుమార్, బూర్గుల రాజు, తుపాకుల ఐలు కొమురయ్య, మధు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.