

పత్తి కృష్ణారెడ్డి జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట// కుమార్ యాదవ్..హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలో పత్తి కృష్ణా రెడ్డి, పీసీసీ సభ్యుల ఆధ్వర్యం లో పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయబడినది.విలేకరుల సమావేశం నందు పత్తి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ…బి ఆర్ ఎస్ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బి ఆర్ ఎస్ నాయకులు తట్టుకోలేక పోతున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ దళిత స్పీకర్ ను నియమిస్తే హర్షించాల్సింది పోయి స్పీకర్ ని ఏకవచనం తో మాట్లాడి కించపరిస్తే జగదీశ్వర్ రెడ్డి ని సమర్ధిస్తారా అని మండిపడ్డారు.బీసీ కులగణన చేసి రాష్ట్రం లోని బీసీ లకు మేలు చేయాలని చేస్తుంటే అడ్డుకోవడం సరికాదు అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రిని, కుటుంబ సభ్యులను దూషిస్తూ వీడియోలు పెట్టించడం హేయమైన చర్యగా తెలిపారు.హుజూరాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రాష్ట్ర ముఖ్యమంత్రి ని, 3 లక్షల కుక్కలకు నాయకుడనటం సరికాదని,అని నిన్ను నీ వెంట ఉన్న ప్రజా ప్రతినిధులను ఏమని పిలవాలని ప్రశ్నించారు.కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని,పిచ్చి పిచ్చి గా మాట్లాడితే ఊరుకునేది లేదని,నియోజక వర్గం లో తిరగాలంటే జాగ్రత్తగ మాట్లాడాలని,కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో…జమ్మికుంట మండల అధ్యక్షులు పరుశరామరావు ,వ్యవసాయ మార్కెట్ వైస్ ఛైర్మెన్ సత్తి రెడ్డి ,ఇల్లందకుంట మాజీ మండల అధ్యక్షులు రామా రావు. దిడ్డి రాము ,వంగరామకృష్ణ ,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దీక్షిత్ ,సూర్య,ముద్దమల్ల రవి,కోడెం రజిత,తోట స్వప్న,గొడుగు మానస, కోడెం శ్రీను,తిరుపతి రెడ్డి,గడ్డి శ్రీను, శ్రీధర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.