

జనంన్యూస్. 17. నిజామాబాదు.ప్రతినిధి. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు మార్పు పై అసెంబ్లీలో పెట్టిన తీర్మానం పై ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పేరు మార్పు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకస్తున్నాం అన్నారు. ఇది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఒక అవివేకపు చర్య అని తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చేది పొట్టిశ్రీరాములు అన్నారు యూనివర్సిటీ పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలనీ సూచించారు.
పొట్టి శ్రీరాములు త్యాగం మర్చిపోలేని చరిత్ర పొట్టి శ్రీరాములు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, దేశం గర్వించే మహనీయులలో ఒకరని స్వాతంత్ర పోరాటంలో గాంధీ తో కలిసి పనిచేసి, ఖాదీ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. అహింసా మార్గం, పట్టుదల, ధైర్యం దేశానికి మార్గదర్శిగా నిలిచాయన్నారు. పొట్టి శ్రీరాములు దళితుల హక్కుల కోసం నిరాహార దీక్ష
పొట్టి శ్రీరాములు కేవలం భాషాపరమైన ఉద్యమం కోసం మాత్రమే కాకుండా, దళితుల హక్కుల కోసం అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులని, దళితులను గుడులలోకి ప్రవేశింపచేయాలనీ నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు.అన్నారు. తెలుగు రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం పొట్టి శ్రీరాములు. త్యాగమే భాష ప్రయుక్త రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణకు పునాదులయ్యాయని. ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు ఆయన 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారని వారి త్యాగం వల్లే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు పేరు మార్పు పై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. పొట్టి శ్రీరాములు.పేరు తొలగించడం అంటే, తెలుగువారి త్యాగాన్ని అవమానించడమే అవుతుందన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి . గొప్ప సంస్కృతి శాస్త్రవేత్త, సమాజ సేవకులు. గౌరవించడాన్ని పూర్తిగా స్వాగటిస్తున్నాం అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి గారు పత్రిక సంపాదకులుగా, పరిశోధకులుగా, పండితులుగా, రచయిత గా, క్రియాశీలక ఉద్యమకారునిగా నిజాం నిరంకుశ పాలనలో తెలుగు వారిపై జరుగుతున్నా అఘాత్యాలను, అవమానాలకు వ్యతిరేకంగా తన కలం తో ప్రజలను చైతన్యం చేసిన మహనీయులు సురవరం ప్రతాపరెడ్డి గారు అన్నారు.అలాంటి మహనీయుని పేరు చిరస్థాయి గా తెలంగాణ బిడ్డల గుండెల్లో నిలవాలంటే ప్రతేక తెలంగాణ ఉద్యమనికి ప్రాణం పోసిన ఉస్మానియా యూనివర్సిటీ కి అతని పేరు పెట్టాలని డిమాండ్ చేసారు. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందే ని రు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం అనేది ఒక మహనీయుని పెరుమిద భారత దేశంలో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం పేరు దాన్ని మార్పు అంటే ఒక తెలుగు జాతికే అవమానం కాదు ఇరు రాష్ట్రాలలో ఉన్నా వైష్య జాతిని అవమణించినట్టే అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు నిజాం వారసులో నిజమైన నికార్సైన తెలంగాణ వారసులో తేల్చుకోవాలన్నారు. తెలంగాణ బిడ్డలైతే ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టి గౌరవించాలన్నారు. పొట్టి శ్రీరాములు పేరు తొలగిస్తే ఆర్యవైశ్య జాతి మొత్తం మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఒక ఉద్యమాన్ని లేవనేత్తుతం అని హెచ్చరించారు. వైశ్య జాతిని మొత్తాన్ని ఏకం చేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా పోరాటం చేస్తాం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బనీయ నహితో దునియా నహీ హై’ . అన్నట్లుగా ఆర్యవైశ్య జాతి బిడ్డలు దేశ, రాష్ట్ర ఆర్ధిగా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నిజాం ఆనవాళ్లను చెరిపివేస్తూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలని ఇదే తెలంగాణ ఉద్యమ చరిత్రకు నిజమైన గౌరవ నివాళి! అన్నారు.