Listen to this article

జనంన్యూస్. 17. సిరికొండ. నిజామాబాదు. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని హుసేన్ నగర్ గ్రమంలో. పేదల భూములను ముట్టుకుంటే తగిన బుద్ధిచెప్తాం. సిపిఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర క్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ హేచ్చరిక. పేదల సాగుభూముల జోలికొస్తే తస్మాత్ జాగ్రత్త అని
పేదల భూములను ముట్టుకుంటే తగిన బుద్ధిచెప్తామని హుస్సేన్ నగర్ సర్వే నెంబర్ 836 సీలింగ్. భూములను పేదలకే ఇవ్వాలి. సిపిఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ హేచ్చరించ్చారు సోమవారం నాడు హుస్సేన్ నగర్ ప్రభుత్వం భూములను వెంటనే కబ్జాలో ఉన్న లబ్ధిదారులకు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తు సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతు: సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామ పరిదిలోని సీలింగ్ ధ్వారా వచ్చిన ప్రభుత్వ భూమి సర్వే నెం: 836లో య స్సీ, బీసీ, మైనారిటీలకు చెందిన 70 మంది వ్యవసాయ కూలీలు 15 సంవత్సరాలనుండి సుమారుగా 130- 150 సాగుచేసుకుంటున్న భూమిని పట్టాలు ఇవ్వాలని 15 సంవత్సరాల నుండి పోరాడుతుంటే పైరవి కారులు లేని వ్యక్తులను సృష్టించి బినామీల పేరుతో విలువైన భూమాలను కబ్జా చేసి కొట్టేయ్యాలని ప్లాన్ చెస్తున్నారని ఆయన ఆరోపించారు. పైరవి కారులు ఒక ముఠాగా ఏర్పడి కొంతమంది వద్ద 1, 2 లక్షల చొప్పున వసూల్ చేస్తున్నట్టు తెలిసిందని ప్రజలు ఎవరు కూడా ఈ పైరవి కారులను నమ్మొద్దు అని ఆయన సూచించారు.
పేదలు సుమారుగా 130-150 ఎకరాలను గత 15 సంవత్సరాలనుండి సొయా, జొన్న సజ్జ, తదితర అరుతడి పంటలను సాగు చేసుకుంటున్నారని. అందులో SC మాదిగలు 32 మంది మాల కులానికి చెందిన 03 (ముగ్గురు), బీసీ కులాలకు చెందిన గొల్ల, ముదిరాజ్ లు, మైనారిటీ లు 35 మంది మొత్తం 70 కుటుంబాలు సాగు చెసుకుంటున్న.జీవనోపాధి పొందుతున్న. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు.
సీలింగ్ లో వచ్చిన భూమిని ప్రయివేట్ వక్తుల పేరుతో కొట్టేయ్యాలని చూడ్తున్నారని ఆయన అన్నారు. ఇట్టి భూమిని గ్రామవాసి కానీ వ్యక్తి సైదార్ జంగ్. యూసుఫ్ అలీ అనే జగిర్ధార్ కుటుంబంకు చెందిన వారమని పైరవి కారులు అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. భూమి విలువైనది కావడం వల్ల డబ్బులు పోగు చెసుకొని నకిలీ వ్యక్తిని పెట్టి ఈ భూమిని కొట్టేయ్యాలని కొంతమంది చుట్టుపక్కల వారిని పోగుచెసి లక్షల డబ్బులను పోగు చేసుకొని పైరవీలు హైదరాబాద్ లో పైరవీలు నదుపుతున్నారు. గతంలో కూడా ఇదే సిరికొండ మండలం లోని మా పొలిమేర లో గల రామడుగు గ్రామంలో ఇలాగే ఇదే జాగీర్ధార్ వారసులమని ఆ గ్రామానికి చెందిన భూములను కబ్జా చేసి పట్టాలు పొందాలని ప్రయత్నాలు చేయగా సీపీఐ(ఎం. ఎల్) ప్రజాపంథా పార్టీ ఉద్యమం, గ్రామస్తుల పోరాటం తో, ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడంతో బినామీ వ్యక్తుల పై గల రిజిస్ట్రేషన్ ను రద్దు చెసి అదే గ్రామనికి చెందేలాగా చేసి అక్కడి వారికి న్యాయం చేశారు.
ఈ మధ్య కాలంలో పహాణి నకల్ లో ప్రభుత్వ భూమిగా రికార్డ్ చేశారు. దీనివల్ల , మైనార్టీ పేదలకు తీరని అన్యాయం చేశారు. రెక్కడితే డొక్కాడని కూలీ, నాలి చేసుకునే పేదాలకు నోట్లో మట్టికొట్టినట్టు చేశారు. మళ్ళీ ఇన్నేళ్లకు మా గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల్లో గల పైరవికారులు, దళారులు డబ్బులు పోగేసుకొని ఇట్టి భూములను లబ్ధిదారులకు అందకుండ కొట్టేయ్యాలని పైరవీలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ మానవతా దృక్పధంతో అలోచించి గత 15 సంవత్సరాలనుండి కబ్జాలో ఉన్న హుస్సేన్ నగర్ గ్రామ సీలింగ్ భూములను అదే గ్రామానికి చెందిన యసి, బీసీ, మైనార్టీ నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్, డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, రావుట్ల. పుష్పలత, బరుకుంట. భూమేశ్వర్,సింగారం. నాగరాజు,ఇస్సాంపల్లి.రామస్వామి,చింతకింది.మహేష్, దేశెట్టి. జెలందర్, రాసావోయిన.గంగాధర్,లక్కం. గోపి, గుండెల. బాబురావు,మంద.నరేష్, లక్కం. గోపి, పులి. లలిత, గోస్కె. లక్ష్మి, బరుకుంట. మనిషా, రావుట్ల. కళ, సెంచు. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.