

కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి 17మార్చ్ ( జనం న్యూస్) ఘనంగా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ కి స్వాగతం పలికిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా నెషనల్ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ ని మర్యాద పూర్వకంగా కలిసి జిల్లాలో ఎస్టి ప్రజలు అధికారులు విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలను సవాళ్ళను వివరించడం జరిగింది జిల్లాలో ఎస్టీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూడడానికి జిల్లాలో ఎస్టీ ప్రజలను విద్యార్థులను ప్రజలను కలుసుకోవడానికి నేరుగా ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్టి కమిషన్ మెంబెర్ జాటోత్ హుస్సేన్ నాయక్ గారిని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నాయకులు జంగా శ్యామ్ చందర్ భూపల్లి పూర్ణ చందర్ విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు