

బీజేపీ నాయకులు… జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి (రంగమ్మపల్లి) గ్రామ పరిధిలోని ఎర్రగట్టు భక్త ఆంజనేయ స్వామి దేవస్థానం, శివాలయం వద్ద కేంద్ర మంత్రి వర్యులు బండి. సంజయ్ కుమార్, సీసీ రోడ్డు నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.ఈ సీసీ రోడ్డు పనులను ఈరోజు ప్రారంభించడం జరిగింది.దీనిని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జమ్మికుంట మాజీ జెడ్పిటిసి సభ్యులు డాక్టర్.శ్రీరామ్ శ్యామ్, సందర్శించి సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు,మాజీ జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ… జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాలలో సీసీ రోడ్ నిర్మాణాలకు 78 లక్షల రూపాయలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటాయించడం జరిగిందని వారు గుర్తు చేశారు. గ్రామాల అభివృద్దే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని బీజేపీ నాయకులు కొనియాడారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని తెలిపారు.గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. గతంలో కూడా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని,కాని కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడం లేదని అబద్ధపు ప్రచారం చేస్తోందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. గ్రామాలలో స్మశాన వాటిక నుండి మొదలుకొని పల్లె ప్రకృతి వనం వరకు అనేక నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని వారు గుర్తు చేశారు. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ సహకారంతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పర్చుకుంటామని తెలిపారు.నియోజక వర్గ అభివృద్ధికోసం కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ పడిదెల సంపత్ రావు, ఉప సర్పంచ్ హేమ శంకర్ సామాజిక కొమురయ్య, నాయకులు నరిగె రాజేందర్, నీలం మహేందర్, నీల,పోచయ్య గట్టు వీరన్న, వెంగళరావు, దుగ్గినాల రవీందర్, నీల సమ్మయ్య, గొర్రె కుమార్,రాజేశ్వరరావు, జిట్ట ప్రభాకర్, ఇతర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.