

జమ్మికుంట నుఁడి హైదరాబాద్ కు బస్సు పునరుద్దించండి.. సిపిఎం పార్టీ మండల సహాయ కార్యదర్శి వడ్లూరి కిషోర్.. జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణం నుండి హైదరాబాద్ కు బస్సు పునరుద్దించాలని సిపిఎం మండల సహాయ కార్యదర్శి వడ్లూరి కిషోర్ తెలిపారు. సోమవారం నాడు హుజురాబాద్ పట్టణంలోని డిపో కార్యాలయంలో డిపో మేనేజర్ రవీంద్రనాథ్ కి వినతి పత్రం ఇచ్చినా అనంతరం కిషోర్ మాట్లాడుతూ … జమ్మికుంట పట్టణం నుండి జమ్మికుంట చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిమంది ప్రజలు వివిధ అవసరాల కోసం ఆసుపత్రుల కోసం నిత్యం హైదరాబాద్ కు వెళ్తున్నారని అన్నారు. గతంలో ముద్దసాని దామోదర్ రెడ్డి హయాంలో చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా బస్సు సౌకర్యం హైదరాబాదుకు ఉండేదని గత రెండు మూడు సంవత్సరాల నుండి బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , జమ్మికుంట పర్యటన సందర్భంగా హామీ ఇచ్చారని ఇచ్చి ఆరు నెలలు అవుతున్న ఇంతవరకు బస్సు పునరుద్దించలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రజల సౌకర్యార్థం జమ్మికుంట పట్టణం నుండి హైదరాబాద్ కు బస్సు సౌకర్యం కల్పించాలని లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కే రమేష్ , అరవింద్, లతోపాటు తదితరులు పాల్గొన్నారు.