

జనం న్యూస్,మార్చి 17,2025* (ముమ్మిడివరం ప్రతినిధి) పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.సోమవారం పదవ తరగతి పరీక్షా కేంద్రమైన కొంకాపల్లి మున్సిపల్ హైస్కూల్ లో పరీక్షల నిర్వహణ సరళి ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పరిశీలించారు.పదవ తరగతి పరీక్షలు మార్చి 17 వ తేదీ(ఈ రోజు నుండి) నుండి ప్రారంభమైన నేపథ్యం లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రం లోని తరగతి గదుల్లోకి వెళ్లి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు .