

జనం న్యూస్ మార్చ్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ వైఎస్సార్సీపీ సర్కార్ ఐదేళ్ల పాలనలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారుల నడ్డీ విరిస్తే అధికారం చేపట్టిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాల నుంచి ప్రజలకు ఊరట కల్పించింది. పలు డిస్కంల పరిధిలో 1059 కోట్ల రూపాయల వరకు ట్రూడౌన్‌ను ఏపీ ట్రాన్స్‌కో ప్రకటించిందని మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు.
గత ఐదేళ్లు విద్యుత్ ఛార్జీలను ఎలా పెంచాలనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆలోచించిందని, ఏటా ఏదో ఒక పేరుతో ఛార్జీల భారాన్ని వినియోగదారులపై మోపిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఛార్జీలను ఎలా తగ్గించాలన్న ఆలోచన తొలిసారి చేసిందని, 2019-24 మధ్య నాలుగో నియంత్రిత వ్యవధిలో 1,059.75 కోట్ల రూపాయల ట్రూడౌన్‌ను ఏపీ ట్రాన్స్‌కో ప్రకటించడం హర్షణీయమని నాగ జగదీష్ అన్నారు. ఐదేళ్ల తర్వాత ట్రూడౌన్ పేరు ప్రజలకు వినపడిందని, గత వైసీపీ ప్రభుత్వం ట్రూఅప్, ఎఫ్‌పీపీసీఏ పేర్లనే పరిచయం చేసిందని, విద్యుత్ కేటాయింపుల ఆధారంగా ట్రూడౌన్ మొత్తాన్ని ఈపీడీసీఎల్ రూ.383.84 కోట్లు, ఎస్పీడీసీఎల్ రూ.428.56 కోట్లు, సీపీడీసీఎల్ రూ.247.35 కోట్ల చొప్పున సర్దుబాటు చేయాలని కమిషన్ నిర్ణయించిందని నాగ జగదీష్ అన్నారు. ఆ మొత్తాన్ని వినియోగదారుల బిల్లులో సర్దుబాటు చేస్తారా అనే దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, నాలుగో నియంత్రిత వ్యవధిలో పెట్టుబడి వ్యయం కింద వివిధ అభివృద్ధి పనులకు ఏపీఈఆర్సీ అనుమతించిన ఖర్చు వాస్తవ ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూడౌన్ కింద సర్దుబాటు చేసేందుకు ట్రాన్స్‌కో ప్రతిపాదించిందని, కొవిడ్ కారణంగా 2020 మార్చి నుంచి రెండేళ్ల పాటు లాక్‌డౌన్, కూలీలు సరిగా దొరక్క అభివృద్ధి పనులు చేయలేదని దీంతో ఇచ్చిన నిధులు మిగిలాయని, ఖాతాల సర్దుబాటు కింద ఆ మొత్తాన్ని డిస్కంలకు బదిలీ చేసేందుకు కమిషన్ అనుమతి కోరుతూ ట్రాన్స్‌కో పిటిషన్ దాఖలు చేసిందని, ఇదే కాలానికి డిస్కంల ప్రతిపాదనలపైనా కసరత్తు చేస్తున్నారని, ఈపీడీసీఎల్ 240 కోట్ల రూపాయల ట్రూడౌన్ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు విశ్వనీయ సమాచారo ఉందని,సీపీడీపీఎల్ నుంచి కూడా రూ.400 కోట్ల వరకు ట్రూడౌన్ వచ్చే అవకాశం ఉందని అంచన వేస్తున్నారని, ఎస్పీడీసీఎల్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉందని, డిస్కంల ప్రతిపాదనలపై అధికారులు పరిశీలిస్తున్నారని త్వరలో ప్రకటన వస్తుందని నాగ జగదీష్ ఆశాభావం వ్యక్తపరిచారు. ట్రూఅప్ అంటే: ఏపీఈఆర్‌సీ అనుమతించిన మొత్తం కంటే వాస్తవ ఖర్చు అదనంగా చేస్తే దాన్ని లెక్కించి ట్రూఅప్ కింద విద్యుత్ సంస్థలు వసూలు చేస్తాయని, ట్రూడౌన్ అంటే: కమిషన్ అనుమతించిన మొత్తం కంటే వాస్తవ ఖర్చు తక్కువగా ఉంటే ఆ మిగులు మొత్తాన్ని వినియోగదారులకు సర్దుబాటు చేస్తాయి. ఆ మేరకు వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం ఏదోల తగ్గించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని నాగ జగదీష్ అన్నారు.//