

జనం న్యూస్ మార్చి 18(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి అమ్మవార్లకు వేలాది మంది భక్తజనుల సమక్షంలో గాందోళి వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి వసంతోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కనుల పండుగగా గాందోళి ఉత్సవాన్ని తిలకించి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆలయ చైర్మన్ సారిక చిన్న రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో మహా అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.గాందోళి ఉత్సవానికి సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు


