Listen to this article

వాడ బలిజ కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి అచ్చునూరి కిషన్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర మిటీ సభ్యుడు. డర్ర దామోదర్ వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. మార్చి 17 జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ ఈరోజు వెంకటాపురం మండల కేంద్రం’లో “వాడ బలిజ సేవా సంఘం” అధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అచ్చునూరి కిషన్ హాజరై మాట్లాడుతూ….. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన లెక్కలను, కులాల వారిగా తెలియపరచి, తెలంగాణ రాష్ట్రం’లో గోదావరి పరివాహక ప్రాంతం అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మొదలు, ఆసిఫాబాద్ జిల్లా వరకు దాదాపు రెండు లక్షల పైచిలుకు జనాభా కలిగిన వాడ బలిజ కులస్తులు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం వారిని గుర్తించి అందుకోవాలని, ప్రభుత్వం’లో వారికి రావాల్సిన వాటాను జనాభా ప్రాతిపదికన కేటాయించాలని, అలాగే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న బీసీ ఉద్యమానికి వాడ బలిజ సేవా సంఘం సంపూర్ణ మద్దతు” తెలియజేస్తుదని డర్ర దామోదర్ తెలిపారు అతి త్వరలో వెంకటాపురం మండల కేంద్రము’లో వాడ బలిజ సేవా సంఘం అధ్వర్యంలో భారీ సభ ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న’ను ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జున్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగూరి రమణయ్య, గార ఆనంద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లె భాస్కర్, ముత్తబోయిన ప్రసాద్, బొల్లె రమేష్, విక్రమ్, రజీనికాత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.