Listen to this article

సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా వైద్యాధికారి సీతారాం కి ఆశావర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలోనివినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సంధర్భంగా జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000/-లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి. ప్రమోషన్, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నగరం పద్మా ఆశా జిల్లా నాయకులు అనితా, పంచశీల భారతీ నవీన పంచశీల పాల్గొన్నారు.