

జనం న్యూస్- మార్చి 18- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- శ్రీ వేమూరు అభిరామేశ్వరరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శేషు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరారు, ముఖ్య అతిథులుగా హాజరైన సాంబశివరావు విద్యార్థులకు పెన్నులు బహుకరించగా మరొక అతిథి రాములు విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు బహుకరించారు, ఈ సందర్భంగా వారు తమ అనుభవాలను జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు, ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్షలు ఎలా వ్రాయాలో మెలుకువలు గురించి వివరించారు, హిల్ కాలనీ బాల భవన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజాబాబు, అంజయ్య, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, భాగ్య, ఆజాం, బాలు, మధు, విమల ,వరలక్ష్మి, రాజేష్, వజ్రమ్మ, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.