

6 వ రోజుకు చేరిన గిరిజన హాస్టల్ వర్కర్ల సమ్మె జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 6 రోజులుగా కొనసాగుతున్న సమ్మె లో భాగంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని వెంటనే జిల్లా అధికార యంత్రాంగం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించి ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన కార్మికులకు అన్యాయం తలపెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు అధికారులు స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాల నాయకులకు తమ తరఫున ఉద్యమాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వర్కర్ల యూనియన్ జిల్లా నాయకులు, శ్యామలా పద్మా, నాగేశ్వరి రమేష్, తార రమేష్,పతుబాయి, లక్ష్మీ రాంబాయి,మామిడి లక్ష్మీ, క్రిష్ణ శివరాం ఇతరులు పాల్గొన్నారు.