Listen to this article

జనం న్యూస్, మార్చి 18, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) 2022-23 యాసంగి ధాన్యం వేలం సోమ్ము ప్రభుత్వానికి సకాలంలో జమ చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు రైస్ మిల్లర్లను ఆదేశించారు.సోమవారం అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ లో. ధాన్యం సోమ్ము జమ పై రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ, 2022-23 యాసంగి ధాన్యం పంటను ప్రభుత్వం వేలం వేసిందని, ధాన్యాన్ని దక్కించుకున్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వేలం సొమ్ము పూర్తిస్థాయిలో చెల్లించాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ రైస్ మిల్లర్లు కొంతమంది దాన్యం జమ చేయడం లేదని, ప్రభుత్వం అందించిన గడువులోగా కొనుగోలు చేసిన దాన్యానికి సరిపడా నిధులను తప్పనిసరిగా జమ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్ఓ రాజేందర్, బియ్యం సివిల్ సప్లై శ్రీకాంత్, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.