

జనం న్యూస్ మార్చి 17 నడిగూడెం విద్యార్థులు లక్ష్యం వైపు గురిపెట్టి విజయతీరాలకు చేరుకోవాలని నడిగూడెం మండల విద్యాధికారి బి.ఉపేందర్ రావు అన్నారు. సోమవారం మండలంలోని రామాపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుని తమ తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు,విద్యార్థులు పాల్గొన్నారు.