

జనం న్యూస్ మార్చి 17 నడిగూడెం విజయవాడలో వైఎంకే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి కప్ కరాటే నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో నడిగూడెం గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపల్ చింతలపాటి వాణి సోమవారం తెలిపారు. పాఠశాలకు చెందిన ఎ.అశ్విత కటా విభాగంలో సిల్వర్ మెడల్, మర్రి మీశ్రిత, తాళ్లపాక బ్లెస్లి గోల్డ్ మెడల్, చరణ్య, పి. లక్ష్మి సిల్వర్ మెడల్ సాధించినట్లు తెలిపారు.