

జనం న్యూస్ మార్చి 18(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రజా సమస్యల సాధనకై సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమంలో మునగాల మండల కేంద్రంలో ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది అనంతరం మునగాలలో అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలిస్తున్న రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిపిఎం పార్టీ నాయకులు దేవవరం వెంకటరెడ్డి మునగాల మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గత ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి అట్టహాసంగా ప్రారంభించి మధ్యలో అసంపూర్తిగా వదిలేసి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నది అట్టి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఈ ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ఇంటి స్థలం ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే పంచాలని డిమాండ్ చేసినారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇండ్లు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి నేటికీ సంవత్సరం దాటుతున్న కూడా అతిగతి లేదని అన్నారు అట్లాగే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని వృద్ధాప్య పెన్షన్లు లేని వారికి కొత్తగా పెన్షన్లు ఇస్తామని పెన్షన్లు పెంచుతామని భూమిలేని పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని అనేక రకమైన వాగ్దానాలు చేసి నేటికీ ఏ ఒక్క హామీ కూడా అమలు జరగలేదు అలాగే రైతు రుణమాఫీ రైతు భరోసా కూడా నేటికీ పూర్తిగా అమలు జరపలేదని అన్నారు కావున పై సమస్యలన్నింటి పరిష్కారం కొరకు మార్చి 26వ తారీఖున సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరినారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శులు కిన్నెర వెంకన్న గడ్డం వినోద్ ఇటికాల వెంకులు నెమ్మది రాములు సిరక్పాంగి కోటయ్య మిట్టగనపుల వెంకయ్య డాకూరి బంగారమ్మ పెడమర్తి ఎల్శమ్మ తదితరులు పాల్గొన్నారు