

జనం న్యూస్ 18 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కోర్టులో ఉన్న హీయరింగ్ కేసుని వేగంగా పరిష్కరించి కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ )ఆధ్వర్యంలో కోటజంక్షన్ వద్ద నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది..విజయనగరం కలెక్టర్ . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ch. హరీష్, నిరుద్యోగులు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంలో హరీష్ మాట్లాడుతూ
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 20 22 నవంబర్ 28న 6100 పోస్టలు బర్తీ చేశారు2023 జనవరి 22న ఫ్రీలిమ్స్ పరీక్షకు 4 , 59 ,182. మంది హాజరయ్యారు ప్రిలిమ్స్ పరీక్షలలో 95 208 మంది అర్హత సాధించారని ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు కోర్టు కేసులు 2024 డేసింబర్ 1 నుండి జనవరి 25వరకు ఈవెంట్స్ జరిగాయి. మెయిన్ ఎగ్జామ్ గురించి ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం రావడం దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఒకవైపు పగలనకా, రాత్రనకా ,రీడింగ్ రూముల్లో చదువుకుంటూ, పస్తులు ఉంటూ, రీడింగ్ రూమ్ లు కోచింగ్ సెంటర్లకు రెంటల్ కట్టలేక, ఇబ్బంది పడుతున్నారు… కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం ఎదురుచూస్తూ నిరాశ చెందుతున్నారు..కావున ప్రభుత్వ వెంటనే చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోDYFI ఉద్యక్షులు బ్. సతీష్ నాగరాజు, శివ, లక్ష్మణ,, శంకర్,హరీష్, సోమేశ్ ,రాజు, సూరిబాబు, లక్ష్మి , జయలక్ష్మి ,శిరీష కానిస్టేబుల్ 250 మంది అభ్యర్థులు పాల్గొన్నారు….