

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 18 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిణి యల్. చంద్రకళకు గిరిజన సంఘాల నాయకుల వినతి. వేసవికాలం దృష్ట్యా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని కూటమి ప్రభుత్వం ఉదయం 8.45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ విధంగా అమలు చేయడంలో ఆయా నియోజకవర్గాల్లోని మండల విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని మంగళవారం పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిణి యల్. చంద్రకళకు గిరిజన సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు రెండు పూటల బడులు నిర్వహిస్తున్నారని సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించి డిప్యూటీ డిఈఓ, ఆయా నియోజకవర్గాల విద్యాశాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏఓ, ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్, గిరిజన విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు కెతావతు పాండు నాయక్ పాల్గొన్నారు.