Listen to this article

బిచ్కుంద మార్చి 18 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ అయినా బిచ్కుంద తైబజార్ వేలంపాట మంగళవారం నాడు గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమక్షంలో ఈ వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో మొత్తం ఐదుగురు సభ్యులు రెండు లక్షలు డిపాజిట్ చేసి పాల్గొనగా ఖాజామియా మరియు గాండ్ల శివ పోటీపడి నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగింది.చివరకు ఖాజామీయా పద్దెనిమిది లక్షల 70 వేలకు వేలం పాట పాడి దక్కించుకున్నారు. ఖాజామీయను గ్రామ సెక్రెటరీ,సిబ్బంది, గ్రామ పెద్దలు శాలువాతో సన్మానించినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్, నౌష నాయక్, యోగేష్ , బొగడ మీద సాయిలు, గాండ్ల అశోక్, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు