

జనం న్యూస్ మార్చ్ 18 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం జిల్లా బెజ్జర్ మండల కేంద్రంలోని కస్తూరిభ గాంధీ బాలికల విద్యాలయం లో 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు మంగళవారం రోజున వ్యక్తిత్వ వికాసం పై అవగాహనా సదస్సు నిర్వహించారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ G. అరుణ గారి అధ్యక్షణ జరిగిన సదస్సు లో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మోటివేషనల్ స్పీకర్ సుందిళ్ల రమేష్ గారు విద్యార్థులకి పలు విషయాలను వివరించారు. ఆత్మ విశ్వాసo లో ముందు అడుగు వేస్తే విజయం వరిస్తుందని *ప్రతి విద్యార్ధికి లక్ష్య నిర్దేశం ఉండాలని దీనికి క్రమశిక్షణ ముఖ్యం అని *క్రమశిక్షణ తో పాటు సమయపాలన పాటించాలని
*సినిమాలు చెడు అలవాట్లకు అదేవిదంగా సెల్ ఫోన్ కు ఆకర్షతులవటం దాని వల్ల నష్టాలు *ప్రతిభ తో మాత్రమే జీవితంలో పైకి రావచ్చు అని *బాల్యవివాహాలు చేసుకోకూడదని ఊహిoచని భయాలు పెట్టుకోకూడదు అని *స్వీయనియంత్రనా పాటిస్తూ ఒత్తిడిని జయించాలని ఒత్తిడిని జయించడానికి ప్రతి విద్యార్థి ఫీజికల్ రిలేక్సషన్, మెంటల్ రిలేక్సషన్ ఎమోషనల్ రిలేక్సషన్ అలవాటు చేసుకోవాలని
విద్యార్థి దశ లోని వారి బలాలు బలహీనతలు గూర్చి వాటిని జయించే పదతుల గురించి వివరించడం జరిగింది. పై అంశాలతో పాటుగా విద్యార్థులలో పరీక్షలంటే అసలు భయం ఉండకూడదని తెలియచేసారు