

జనం న్యూస్ // మార్చ్ // 19 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం (మార్చ్ 20) సందర్భంగా జీవ వైవిద్యంలో భాగంగా పిచ్చుకల సంరక్షణ కోసం విద్యార్థులకు చిత్రలేఖనం పిచ్చుక గూడు నిర్మాణం (నెస్ట్ మేకింగ్) వివిధ అంశాలలో సృజనాత్మక పోటీలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జడ్.పి.హెచ్.ఎస్ ఏడవ తరగతి చదువుతున్న.. విద్యార్థి దుర్గం ప్రహర్ష తన సైన్స్ ఉపాద్యాయులు నాత రాజేష్ మార్గదర్శకత్వంలో
ఈ కార్యక్రమంలో, పాల్గొన్నారు.. నెస్ట్ మేకింగ్ లో విద్యార్థి ప్రతిభను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఆర్ నివేదిత మరియు ఉపాద్యాయులు విద్యార్థి దుర్గం ప్రహార్ష ను అభినందించారు.