Listen to this article

జనంన్యూస్ మార్చి 18: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో ఉన్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రోజునా పీఎం శ్రీ పథకంలో భాగంగావార్షికోత్సవ వేడుకలను సాయంత్రం చాలా నంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాకాధికారి అశోక్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని ,ముఖ్యంగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖా భివృద్ధి కి ఉపయోగ పడతాయని తెలిపారు .పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు పలుసూచనలు ఇస్తూ , విద్యార్థులు మంచిగాచదివి భయందోళ నకుగురి కాకుండాపరీక్షలు వ్రాసిమంచి ఫలితాలు సాదించిడం వలన తల్లిదండ్రులకు ,పాఠశాలకు మరియు గ్రామానికి మంచి గుర్తింపువస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమానికి సభాఅధ్యక్షత వహించిన పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ2024 -2025 సంవత్సరంలోఏర్గట్ల ఉన్నత పాఠశాలనుఅన్నిరంగాలలో ముందుకుతీసుకువెళ్లామని, ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని పాఠశాలలో విజయ వంతం చేశామని అన్నారు. ఆ తర్వాత విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి . మంచి సందేశంతోకూడిననాటికలు, విద్యార్థులు చేసిననృత్యాలు అందరినిఅలరించాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారిఆనంద్ రావు ,ఎంపీడీవో వెంకటేశ్వర్లు , వివిధ పాఠశాలల గెజిటెడ్ ప్రధానో పాధ్యాయులు , ఉపాధ్యా యసంఘాల నేతలు, గ్రామకమిటీ, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు