Listen to this article

మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం

జనం న్యూస్ -మార్చ్ 19- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించిన మాదిగ సోదరులు, తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని పురస్కరించుకొని నందికొండ మున్సిపాలిటీ మాదిగ సోదరులు హిల్ కాలనీమెయిన్ బజార్ నుంచి బస్టాండ్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాట ఫలితం, మాదిగ సోదరుల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించడం శుభ పరిణామం అని బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు, అనంతరం బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు, ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రాజీవ్, రాహుల్, లక్ష్మయ్య, ప్రవీణ్, అజయ్, భాస్కర్ సీనియర్ నాయకులు రమణ, పెంచల రాజు, మహారాజుల సేవా సంఘం సభ్యులు వీరబాబు, జి బద్రి, నకులరావు, కొమ్ము పుల్లారావు, మరియు మాదిగ సోదరులు పాల్గొన్నారు.