Listen to this article

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు.. జనం న్యూస్ // మార్చ్ // 19 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ పలురు దళిత శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా చారిత్రాత్మకమైన ఈ ఘటంలో శాసనసభ్యునిగా భాగస్వామ్యం అయినందుకు ఎంతో గర్వపడుతున్నానని, యావత్ తెలంగాణ రాష్ట్రంలోని దళిత సోదరులు హర్శించదగ్గ ఈ అంశం పట్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని చరిత్ర సృష్టించిందని కొనియాడినారు.