Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు రైల్వే పరంగా ఉభయ వైయస్సార్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వే కేంద్రంలో ప్రొటెక్ట్ వీక్ ను రైల్వే ఎంప్లాయిస్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్రాంచ్ సెక్రటరీ వై. రవి ప్రకాష్ నేతృత్వంలో సంగ్ నేతలు రైల్వే కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్ బ్రాంచ్ సెక్రటరీ రవి ప్రకాష్ మాట్లాడుతూ భారతీయ రైల్వేలో పునరుదించాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్ విధానం పై కార్మికుల్లో పూర్తిస్థాయి వ్యతిరేకత ఉందన్నారు. కార్మికులు సంఘటితంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు రాజులేని పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పెంచలయ్య, హాస్టల్ సెక్రటరీ రాజేశ్వరయ్య, వైస్ చైర్మన్ సురేష్ బాబు, బీఈ సీ మెంబర్ రామకృష్ణ, నాయకులు ఎంబీ అత్తర్, నాగరాజు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. కార్మికులు ర్యాలీ నిర్వహించారు