

జనం న్యూస్- మార్చి 19- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నియోజకవర్గ పెదవురా మండలం పర్వేదుల గ్రామ వాస్తవ్యులు కాంట్రాక్టర్ పల్లామోహన్ రెడ్డి మంగళవారం రోజున హైదరాబాదులో మరణించిన విషయం తెలుసుకొని ఈరోజు పర్వేదుల గ్రామంలోని వారి స్వగృహంలో పల్లా మోహన్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మరియు బిఆర్ఎస్ నాయకులు, పల్లా మోహన్ రెడ్డి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బిఆర్ఎస్ నాయకులు.