Listen to this article

జనం న్యూస్ మార్చ్ 19 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండల కేంద్రంలో ఎల్లుండి నుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది . మండలంలోని ఐదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 196 విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు .
పరీక్షా కేంద్రంలో సౌకర్యాలైన విద్యుత్, తాగునీటి వసతి ,షౌచాలయాలు పూర్తి చేయడం జరిగింది .
మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థులు మొదటి రోజు పరీక్షకు ఒక గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలియజేయడం జరిగింది . విద్యార్థులు పరీక్షలను ప్రశాంతంగా ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని తెలియజేయడం జరిగింది . అదేవిధంగా విద్యార్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గాని స్మార్ట్ వాచ్ లు గాని తీసుకొని పరీక్ష కేంద్రానికి రావద్దు అని తెలియజేయడం జరిగింది .
ఈ పరీక్షా సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయానికి పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని తెలియజేయడం జరిగింది .అదేవిధంగా విద్యార్థులు ఉదయం పరీక్ష కేంద్రానికి వచ్చే ముందు తేలికపాటి అల్పాహారం తీసుకొని రావాలని తెలియజేయడం జరిగింది .విద్యార్థులు రాత్రి తొందరగా పడుకొని ఉదయం తొందరగా లేసి పరీక్షకు సంసిద్ధులు కావాలని తెలియజేయడం జరిగింది .విద్యార్థులు కచ్చితంగా పరీక్ష వచ్చే ముందు హాల్ టికెట్స్ తీసుకొని పరీక్ష కేంద్రానికి రావాలని తెలియజేయడం జరిగింది హాల్ టికెట్స్ లేనిచో పరీక్షా కేంద్రంలోకి అనుమతించారని చెప్పడం జరిగింది . ఈసారి ప్రభుత్వం పరీక్షలలో మార్పులు తీసుకురావడం జరిగింది విద్యార్థులకు ఈసారి 24 పేజీల బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది .
ప్రశ్నాపత్రంలో ప్రతి పేజీకి క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులు పరీక్షలను ఒక పండగ వాతావరణం లో రాయాలని సూచించడం జరిగింది పదవ తరగతి విద్యార్థుల కోసం సంవత్సరం నుండి బోధించిన ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాశాఖ తరఫున అభినందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది పదో తరగతి రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది