

జనం న్యూస్ మార్చ్ 19 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీ గణేష్ గడ్డ మహాగణపతి దేవస్థానం లెక్కింపు కార్యక్రమం బుధవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి , ఆలయ ఈవో నిర్వహించారు.103 రోజులలో భక్తుల నుండి కానుకగా హుండీ ఆదాయం 26,98,462రూపాయలు అన్నదాన రూపంలో 1,22,434 మొత్తం హుండీ ఆదాయం28,20,896 వచ్చినట్టు ఆలయ ఈవో లావణ్య వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ పెద్ద ఎత్తున విరాళాలు అందించిన భక్తులకు ఈవో ధన్యవాదాలు తెలియజేశారు. ఈ లెక్కింపులో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పి విజయలక్ష్మి ,ఆలయ ఈవో లావణ్య, తాసిల్దార్ ఆఫీసర్ సంతోష్ కుమార్ శర్మ , ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ తో పాటు అర్చక బృందం,ఆలయ సిబ్బంది, శ్రీ శివకేశవ స్వచ్చంద సేవ సంస్థ సభ్యులు,భక్తులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.