

జనంన్యూస్.19. నిజామాబాదు. సిరికొండ. వ్యవసాయ రంగం పట్ల సవతితల్లి ప్రేమ వైద్యంపైనిధులకోత వ్యవసాయకూలీలపై ఎక్కడ వేసిన గొంగళి అక్కడే- సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్ తీవ్రవిమర్శ. ప్రజా సంక్షేమాన్ని తెలంగాణ బడ్జెట్ విస్మరించినందని, వ్యవసాయ రంగం పట్ల సవతితల్లి ప్రేమను కనబర్చుతుంది అని, వైద్యంపై నిధులకోత పేట్టిందని, వ్యవసాయ కూలీలపై నిధుల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది అని సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్ తీవ్రవిమర్శించారు. మంగళవారం నాడు సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో జరిగిన సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్. పార్టీ డివిజన్ కమిటీ సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈసందర్బంగా సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్. మాట్లాడుతు: ఆరు గ్యారెంటిల హామీతో పాటు, ప్రజాస్వామిక పరిరక్షణ ఆరో గ్యారంటీ గా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పూర్తిగా అమలుకు పునుకోలేదు అన్నారు. ప్రస్తుతం 2025-26 ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ లో తెలంగాణ ప్రజలకు మోచేతికి బెల్లం పెట్టినట్టు ఉంది అన్నారు. వ్యవసాయ రంగం ప్రధానమైంది అంటున్న బడ్జెట్ లో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. వ్యవసాయ రంగానికి నామ మాత్రంగానే 4693 పెంచారని, విధ్యుత్ రంగానికి గతం కంటే 4396 మాత్రమే పెంచారని, వైద్యం కు కేవలం 893 మాత్రమే కేటాయించి చేతులు దుల్పుకున్నారు అన్నారు. విద్యకు 1719 కేటాయించి తన కపటతత్వాన్ని చాటుకున్నారు అన్నారు.
సంక్షేమ రంగంలో విఫలం అయినట్టు గా కనిపిస్తుంది అన్నారు. బడ్జెట్ లో పసుపు రైతుల పట్ల ఏమాత్రం కరుణ చూపలేదు అన్నారు. సన్నపు వడ్లకు మాత్రమే బోనస్ ఇచ్చి ఇతర పంట లు పండించే రైతులకు ఎగనామం పెట్టారు అన్నారు. ఇక ఆరో గ్యారంటీ అయినా ప్రజాస్వామ్య పరిరక్షణ ను విస్మరించారు అన్నారు. రైతు నాయకులపై తెలంగాణ ఉద్యమంలో, రైతంగా పోరాటాల సమయంలో పెట్టిన కేసులను ఇప్పటికి కొట్టివేయలేదు అన్నారు. సమావేశంలో సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బీ. దేవారం, సహాయ కార్యదర్శి ఆర్. రమేష్, పి.వో.డబ్ల్యూ. రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. గోదావరి, పిడిఎసుయూ. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నరేందర్, జి.సురేష్, పార్టీ జిల్లా, డివిజన్, మండల నాయకులు ఎస్ సురేష్, ఎం. ముత్తేన్న, కే. రాజేశ్వర్, జి. కిషన్, ఏ.ప్రకాష్, జి.పరమేష్, ఆర్. దామోదర్, బి. కిషన్, పి. రమ, ఆర్. పుష్పలత, బి. బాబన్న, పి.అంబన్న, బి.కిషోర్, ఎం. లింబన్న, ఈ. రమేష్, ఎస్. కిషోర్, తదితరులు పాల్గొన్నారు.