Listen to this article

డప్పు చప్పుళ్ళ బాణసంచాలతో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం జనం న్యూస్, మార్చ్ 19,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ పరిసరాల గ్రామాల మాదిగ సహోదరులు,మాదిగ సామాజిక వర్గానికి ప్రత్యేక బిల్లు ఆమోదం పలకడంతో బసవేశ్వర చౌరస్తా నుంచి, అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు చప్పుళ్ళతో బాణాసంచాలు పేలుస్తూ నృత్య నాట్య ప్రదర్శనలు చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల సమర్పించి నినాదాలు చేశారు. అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి మాదిగ సహోదరులు ఘనంగా క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పోరాటం ఫలితమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేకూరిందని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బిల్లును ఆమోదించడానికి శాయశక్తుల ప్రయత్నించిన వారందరికీ ప్రత్యేకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ని మాదిగ సామాజిక వర్గం ధన్యవాదలు తెలిపారు.అనంతరం మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఖేడ్ ఎంఆర్పిఎస్ కన్వీనర్ అలగే జీవన్,తడ్కల్ క్లస్టర్ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు లాల్ కుమార్,ఉపాధ్యక్షులు బాన్సువాడ సాయిలు, ఎర్రోళ్ల అంజయ్య, సహాయ కార్యదర్శి చిలుక గంగారం,డప్పు అధ్యక్షులు ఎం యాదయ్య, ఉపాధ్యక్షులు మేత్రి మోషే,ప్రధాన కార్యదర్శులు లింగోళ్ళ గంగారం,మోజేష్, ప్రవీణ్ కుమార్,జైపాల్, మేతిరి బాలయ్య, కిష్టయ్య, నర్సింలు, సాయికుమార్,నాని, ఏసు,ఎర్రోళ్ల మల్లయ్య, యాదయ్య,పరవయ్య, నవీన్,రాజు,రమేష్, మాది సామాజిక వర్గం సభ్యులు,పాల్గొన్నారు.