Listen to this article

జనంన్యూస్. 19. నిజామాబాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఉద్దేశించి ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతు..తెలంగాణ సబ్బండా వర్గాలను మోసం చేసే విదంగా అన్ని వర్గాల ప్రజల ఆశలను నిరాశలుగా మర్చిందన్నారు.కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేసారు తప్పితే వాటి అభివృద్ధికి గత బడ్జెట్ లో కానీ ప్రస్తుత బడ్జెట్ లో కానీ చిల్లి గవ్వ కూడా కేటాయింపులు జరగలేదన్నారు.తెలంగాణ స్వరాష్ట్రము కోసం అసువులు బసిన అమరుల కుటుంబాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందని మండిపడ్డారు అమరుల కుటుంబాలకు 25 వేలు, ఉద్యోగం, ఇళ్ళ ఊసే బడ్జెట్ లో లేదని అన్నారు.
ఐటీ అభివృద్ధికి కేవలం 774 కోట్లు, కానీ మైనార్టీల సంక్షేమానికి 3,591 కోట్లు! అభివృద్ధికి బదులుగా మతపరమైన మోజుకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తూ యువత భవిష్యత్తుతో ఆటలు ఆడుతుందని మండిపడ్డారు.
బీసీ సంకేమనికి.లక్ష కోట్లు అన్ని ఎన్నికల ప్రచారం లో ఉదరకొట్టిన కాంగ్రెస్ గత బడ్జెట్ లో 9200 కోట్ల కేటాయించి ఈ బడ్జెట్ లో కేవలం 11 ,400 కోట్లు మాత్రమే కేటాయించారు- బీసీ అభివృద్ధికి తక్కువ నిధులు కేటాయింపు అంటే వారిని అణగదొక్కే ప్రయత్నమే అన్నారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం అదనంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం అని బడ్జెట్ లో గొప్పలు పలికారు వాస్తవం ఏమిటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయం లో దాదాపు 900 మంది విద్యార్థులు నాసిరకం భోజనం తిని అస్వస్థతకు గురి అయ్యారని మండిపడ్డారు.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం అని బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పారని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎంత మంది రైతు కూలీలకు 12 వేలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.మహిళలకు 2500,తులం బంగారం, నిరుద్యోగులకు 4 వేల భృతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల ఊసే లేదన్నారు.