Listen to this article

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 19: విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రణాళికను నిర్దేశించుకుని ముందుకు సాగాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు అన్నారు మండలంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూల పోచారం పాఠశాల వార్షికోత్సవం వీడ్కోలు సమావేశంలో వారు మాట్లాడారు. తోటి విద్యార్థులతో కలిసి మెలిసి క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.సీనియర్ ఉపాధ్యాయులు డిఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అలవర్చుకోవాలని సూచించారు.విద్యార్థులు విద్యతోపాటు,విద్యేతర రంగాల్లో రాణించాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకుంటే జీవితంలో మంచి వ్యక్తులుగా స్థిరపడతారని వివరించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ బి.రవి. ఉపాధ్యాయులు బి.శోభన్, బి.రవి,కే.శ్యామల, బి.సింగ్యా,వి.రమేష్,జే. నాగేశ్వరరావు,ఎం.చందర్ రావు, పి.శ్రీనివాస్,డి. వెంకటరమణ, హరియానాయక్, ఉషశ్రీ, చందర్, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.